Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆయన వారసులు ముగ్గురూ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండవ వివాహం చేసుకున్నాడు.

మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా, మౌనిక రెడ్డి కూడా తన మొదటి భర్తతో విడిపోయిన తరువాత మనోజ్ ని రెండవ వివాహం చేసుకుంది.
ఇలా వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటై మళ్ళీ తమ జీవితాన్ని ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్న లక్ష్మి మంచు ఇంట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
వివాహం తర్వాత మంచు మనోజ్ తన భార్యతో కలిసి మొదట కర్నూలు చేరుకొని అక్కడ భూమా మౌనిక తల్లిదండ్రులకు నివాళులు అర్పించి వారి ఆశీర్వాదం పొందారు. ఆ తరువాత తిరుమల శ్రీవారిని దర్చించుకున్నారు. ఇక తాజగా ఆదివారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ దంపతులు ఇద్దరూ తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను సందర్శించారు. ఈ క్రమంలో మనోజ్, మౌనిక ఇద్దరు ఇన్‌స్టిట్యూట్‌కి రాగానే విద్యార్థులంతా నూతన దంపతులకు ఆహ్వానం పలికారు. మనోజ్‌తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Manchu Manoj: ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు…
ఇందుకు సంబంధించిన వీడియో మనోజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. మనోజ్, మౌనిక విద్యాసంస్థలోకి అడుగు పెట్టగానే విద్యార్థుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అంతేకాకుండా విద్యార్థులంతా ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకెళ్లారు. నూతన వధువరులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మనోజ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ పట్ల ప్రేమాభిమానాలు చూపించిన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేసాడు.































