Manchu Manoj: మంచు మనోజ్ గత నెల మూడవ తేదీ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. గత నాలుగు సంవత్సరాలుగా మౌనికతో రిలేషన్ లో ఉన్నటువంటి మనోజ్ పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో తన వివాహాన్ని చేసుకున్నారు. అయితే ఇది ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇలా పెళ్లి తర్వాత భూమా మౌనికతో కలిసి ఈయన పలు ప్రాంతాలకు వెళుతూ సందడి చేస్తున్నారు.

మొదటిసారి భార్యతో కలిసి మనోజ్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో ఈయన తన భార్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ తనకు లవ్ లైఫ్ కావాలా లేదా నాకు నచ్చిన సినిమాలను ఎంపిక చేసుకొని కొనసాగాల అన్న సందిగ్ధంలో పడిపోయాను. నేను పంచిన ప్రేమ తిరిగి వెనక్కి రాలేదు. చాలా సార్లు నేను తన (ప్రణతి) కోసం ఇష్టం లేని పనులు చేయాల్సొచ్చింది. నాకు అసౌకర్యంగా అనిపించింది.
ఒక టైమ్ లో నేను ఎక్కడ నిలబడి ఉన్నాను? ఎవరి కోసం నిలబడ్డానో తెలియక తికమక పడ్డాను. అప్పుడే విడాకులు తీసుకున్నాను అంటూ తెలిపారు.

Manchu Manoj: నాలుగేళ్ల ప్రేమ….
2015 వ సంవత్సరంలో ఎంతోమంది అతిరథ మహారధుల సమక్షంలో ప్రణతి రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసిన మనోజ్ 2019వ సంవత్సరంలో విడిపోయారు. అనంతరం ఒంటరిగా ఉన్న ఈయన గత నాలుగు సంవత్సరాలుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్నారని,అందరిని ఒప్పించి తమ పెళ్ళి చేసుకున్నా అంటూ ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































