Manoj: సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజులకి ఈ జంట అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఈ శుభవార్తను మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇలా మనోజ్ తండ్రి కాబోతున్నారనే వార్త అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మనోజ్ తరచు తన భార్య ప్రెగ్నెన్సీ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్ మౌనిక దంపతులు తల్లిదండ్రులుగా మారారని వీరిద్దరికీ కవల పిల్లలు పుట్టినా, ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
నేనే చెబుతాను..
ఈ వార్తలపై మనోజ్ స్పందించారు నా కుటుంబంగా భావించే మీ అందరికీ ఓ శుభవార్త నేను తండ్రి అయ్యానని కవల పిల్లలకు మౌనిక జన్మనిచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. ప్రస్తుతం తనకు ఏడవ నెల అని తను ఆరోగ్యంగా క్షేమంగా ఉందని తెలిపారు. ఇలాంటిది ఏదైనా ఉంటే తానే సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను అంటూ మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































