Manchu Vishnu: బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు నటుడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్.
ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఈ టీజర్ పై ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు స్పందిస్తూ విమర్శలు కురిపించారు.రామాయణం అంటే ఒక అద్భుతమైన మహాకావ్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు రావణాసురుడి లుక్ పూర్తిగా మార్చేసారంటూ ఎంతోమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఈ సినిమా టీజర్ పై తాజాగా మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు స్పందించారు. ఈయన నటించిన జిన్నా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడినటువంటి మంచు విష్ణు ఈ సినిమా టీజర్ తనని ఎంతో నిరాశపరిచిందని తెలిపారు.రామాయణం సినిమాని లైవ్ సినిమాగా చూపిస్తారనుకుంటే యానిమేషన్ చిత్రంగా చూపిస్తున్నారని,ఈ సినిమా టీజర్ చూస్తుంటే అచ్చం రజినీకాంత్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని తెలిపారు.
Manchu Vishnu: యానిమేషన్ సినిమా చూపిస్తున్నారు..
ఇక ఈ సినిమా టీజర్ విడుదలకు ముందే ఇది ఒక యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే టీజర్ పై ఈ స్థాయిలో విమర్శలు వచ్చేది కాదని ప్రేక్షకులను మోసం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ విష్ణు ఈ సినిమా టీజర్ పై తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ టీజర్ విషయం పై విమర్శలు ముగిశాయి అనుకునే లోపు మరోసారి విష్ణు టీజర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విష్ణు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.