మా సభ్యులకు శుభవార్త చెప్పబోతున్న నూతన అధ్యక్షుడు.. అదేమిటంటే?

0
175

ఎన్నో విమర్శలు అనంతరం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవిని మంచు విష్ణు దక్కించుకున్నారు. ఈ ఎన్నికలలో భాగంగా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. ఇలా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు అధిక మెజారిటీతో గెలిచి మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలోనే మా భవనాన్ని తన సొంత డబ్బులతో నిర్మిస్తానని చెప్పిన మంచు విష్ణు పలు ప్రాంతాలలో భవనాన్ని నిర్మించడం కోసం స్థలాన్ని కూడా వెతికే పనిలో పడ్డారు. అయితే మూడు నెలల్లోగా భవనం గురించి క్లారిటీ ఇస్తానని చెప్పిన మంచు విష్ణు తాజాగా మా సభ్యులకు శుభవార్త అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే ఆ శుభవార్త ఏంటి అనేది మాత్రం 22 వ తేదీ అనగా రేపు వెల్లడించనున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ప్రమాణ ఉత్సవం స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా మంచు విష్ణు మా సభ్యులకు శుభవార్తను తెలియజేయనున్నారు. అయితే ఏ విధమైనటువంటి శుభవార్త తెలియజేయనున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.

మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్,విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య ఎన్నో విమర్శలు జరిగిన అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులందరూ ఆ తర్వాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా మా ఎన్నికల గొడవ ముగిసిన తర్వాత మొట్టమొదటిసారిగా విష్ణు శుభవార్తను తెలియజేస్తున్నానని హింట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here