Manisharma: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది. ఈయన చేసినది తక్కువ సినిమాలే ఆయనప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం విపరీతంగా ఉంటాయని విషయం అందరికీ తెలిసిందే.

ఇలా ఒకానొక సమయంలో యూత్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపై కాస్త ఫోకస్ తగ్గించి రాజకీయాలలో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చినటువంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భూమిక పవన్ కళ్యాణ్ జోడీగా ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇందులో ప్రతి ఒక్క పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మణిశర్మ ఈ సినిమాలోని యే మేరా జహ’ అనే సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో ఈ పాట పెట్టాలని ఐడియా ఇచ్చినది పవన్ కళ్యాణ్ అంటూ ఈయన వెల్లడించారు.

Manisharma: ఈ పాట పెట్టాలని ఆలోచన పవన్ దే…
ఖుషి సినిమా కోసం అబ్బాస్ అనే లిరిసిస్ట్ ఈ పాటకు లిరిక్స్ అందించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటివరకు ఏకైక హిందీ పాట ఇదే ఈ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ చాలామందికి రాకపోయినా, అర్థం కాకపోయినా ఈ పాటను ఎంజాయ్ చేసేవారు. ఇలా ఈ ఐడియా పవన్ కళ్యాణ్ ఇవ్వడంతోనే ఈ పాటను పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ పాట అనుకోకుండా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అంటూ ఈ సందర్భంగా మణిశర్మ ఖుషి సినిమాలో పాట గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.