కలర్ ఫోటో హీరో లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా..?

0
128

సినిమాలంటే ఇష్టంతో సినిమాల్లో నటించాలని హైదరాబాద్ కి వచ్చి అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటి అవకాశాలు కేవలం కొందరు మాత్రమే పలకరిస్తాయి. అలా సినిమాలు అంటే ఇష్టం తో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చిన అవకాశాలు అన్నింటిని ఉపయోగించుకుని”మజిలీ” సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుహాస్ ప్రస్తుతం హీరోగా నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.

సుహాస్, చాందిని చౌదరి ఇద్దరూ జంటగా కలిసి నటించిన “కలర్ ఫోటో”ఇటీవలే “ఆహా”ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. సందీప్ రాజ్ దర్శకత్వంలో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ ఎంతో సహజంగా నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో సుహాస్ ఫర్ఫార్మెన్స్ చూసిన సెలబ్రిటీలు సుహాస్ చాలా నాచురల్ గా నటించాడని, ప్రశంసిస్తున్నారు. ఈ చిత్ర విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సుహాస్ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సినిమాలంటే ఇంట్లో వారికి పెద్దగా ఇష్టం లేకపోవడంతో, జాబ్ చేస్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి నంద్యాల పెళ్లి అక్కడి నుంచి వారంలో రెండు మూడు సార్లు హైదరాబాద్ కి వెళ్లిఅవకాశాలకోసం వెతికి వాడట. అప్పటికే ఒక అమ్మాయిని ప్రేమించిన సుహాస్,ఇటు ప్రేమలోనూ అటు సినిమా అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు… దాదాపు ఏడు సంవత్సరాలుగా ఆ అమ్మాయిని ప్రేమించి వారి ఇంట్లో వాళ్లకు వారి ప్రేమ గురించి తెలియజేశారు. లైఫ్ లో సెటిల్ అయ్యాక 2017 సంవత్సరంలో తాను ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకుని అటు నిజజీవితంలోనూ, ఇటు సినీ జీవితంలోనూ విజయాలను అందుకున్నాడు. ఇండస్ట్రీలో సుహాస్కి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here