కొంతమందికి జంతువులు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ఇష్టంతోనే ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. అయితే జంతువులు కూడా వాటంతటే అవే ఎప్పుడూ దాడి చేయవు. మనుషులే రెచ్చగొట్టి మరీ జంతువులను దాడి చేసేలా ప్రేరేపిస్తుంటారు. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఏనుగులు సంచరించే ప్రదేశంలో హైపవర్ ఎలక్ట్రిక్ తీగలు ఏర్పాటు చేసి వాటి చావుకి కారణం అవుతున్నారు కొందరు. మరి కొందరు ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడి మరీ చంపుతున్నారు.

ఈ క్రమంలో మానవులకు, ఏనుగులకు మధ్య ఘర్షణ తలెత్తుతోందని గ్రహించారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్పీ పాండే అనే స్కూల్ టీచర్. అయితే ఇలాంటి ఘర్షణలకు అరికట్టడానికి ఓ టీచర్ ప్రయత్నిస్తున్నాడు. ఏనుగులు సంచరించే కారిడార్లలో ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే దిశగా వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. రియల్ హీరోగా మారిన ఈ టీచర్‌పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ బెంగాల్ లోని జల్ పైగురి జిల్లా.. మల్ బజార్ కు చెందిన 43 ఏళ్ల ఎస్పీ పాండే ఏనుగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అతడు పనిచేస్తున్న ప్రాంతంలో 500 కి పైగా ఏనుగులు ఉన్నట్లు గుర్తించాడు. ఆ తరువాత అపాల్‌చంద్-మహానంద, గోరుమారా-అపాల్‌చంద్, అపాల్‌చంద్-కాలింపాంగ్, అపాల్‌చంద్-కాలింపాంగ్, చప్రమారి-కాలింపాంగ్ వంటి ఐదు కారిడార్లలో ఏనుగులు ఎక్కువగా తిరుగుతున్నాయని గుర్తించారు. అయితే అక్కడ ఏనుగులకు, మనుషులకు మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా.. ఘర్షణ తలెత్తకుండా మనుషులకు అవగాహన కల్పిస్తున్నాడు.
ఈ ఘటర్షణల కారణంగా 2009 నుంచి 2018 మధ్య 116 మంది ప్రాణాలు కోల్పోయారని.. 217 మంది గాయపడ్డారని వెల్లడించారు. ప్రతీ సంవత్సరం సగటున ఏడు ఏనుగులు చనిపోతున్నట్లు తెలిపాడు. అయితే రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వాటి మరణాలను అరికట్టవచ్చని తెలియజేశాడు. ముళ్ల కంచె ప్రమాదాలతో పాటు రైల్వే ట్రాక్ దాటుతూ కూడా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపాడు. ఈ సమస్యలను అరికట్టడానికి అందరూ సహకరించాలన్నారు. ఈ స్కూల్ టీచర్ గురించి తెలుసుకున్న జంతు ప్రేమికులు అతని సేవలను ప్రశంసిస్తున్నారు. అతన్ని వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుటిఐ) గ్రీన్ కారిడార్ ఛాంపియన్ టైటిల్‌తో సత్కరించింది.































