Nagababu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా గుర్తింపు పొందిన నటుడు నాగబాబు గురించి అందరికీ సుపరిచితమే. ఈయన కెరియర్ విషయానికి వస్తే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమా ద్వారా నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే ఈయన నటుడిగా గుర్తింపు పొందక పోవడంతో తన తల్లి అంజనాదేవి పేరుపై అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా వంటి పలు సినిమాలను నిర్మించారు.

ఇకపోతే నిర్మాతగా కూడా నాగబాబు పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు. పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గుడుంబా శంకర్, రామ్ చరణ్ ఆరెంజ్, అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందడంతో నాగబాబు కోట్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇలా నిర్మాతగా భారీస్థాయిలో డబ్బులు కోల్పోయిన నాగబాబు తిరిగి టీవీ షోల ద్వారా డబ్బులు భారీగా సంపాదించారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం, ఇతర టీవీ షోల ద్వారా కోట్లలో సంపాదన కూడా పెట్టి పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవికి పోటీగా ఆస్తులను సంపాదించారు.
జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు..
ఈ విధంగా నాగబాబు టీవీ షోలు,పలు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ సుమారు వంద కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తుంది.ఇక మరోవైపు ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ భారీగానే ఆస్తులను కూడబెట్టిన తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన పలు టీవీ షోల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూనే మరోవైపు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.































