Mega Hero: మెగా వారసుడు వరుణ్ తేజ్ ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాటితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇటీవల ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 9వ తేదీ వీరి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వీరి వరుణ్ తేజ్ – లావణ్య నిశ్చితార్థ వేడుకకు అల్లు వారి కుటుంబం కూడా హాజరయ్యింది. అయితే అల్లు శిరీష్ మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు.
అల్లు శిరీష్ హాజరు కాకపోవడంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ఇక వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థానికి అల్లు శిరీష్ హాజరు కాకపోవటానికి కారణాలేమిటనీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..ఈ క్రమంలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ లావణ్య నిశ్చితార్థానికి అల్లు శిరీష్ హాజరు కాకపోవడానికి పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠి కలిసి శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో నటించారు.

Mega Hero: లావణ్య పై ఇష్టం పెంచుకున్నారా…
ఆ సినిమా షూటింగ్ సమయంలో అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠిని ఇష్టపడ్డాడని ఆ విషయం ఆమెకు చెప్పగా లావణ్య త్రిపాఠి శిరీష్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే లావణ్య అప్పటికే వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉండటంవల్ల అల్లు శిరీష్ ప్రేమను తిరస్కరించినట్లు సమాచారం. అయితే అల్లు శిరీష్ మాత్రం ఆమె మీద ఇష్టాన్ని పెంచుకున్నాడని, అందువల్ల ఇప్పుడు లావణ్యకి వరుణ్తో నిశ్చితార్థం జరగటం వల్ల ఆ బాధతో ఈ నిశ్చితార్థానికి హాజరు కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అల్లు శిరీష్ స్పందించాల్సి ఉంటుంది.































