దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో ఇక్కడి వారు అక్కడే ఉండాలి అంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.. విమాన, రైల్వే, సముద్ర, రోడ్డు అన్ని మార్గాల ప్రయాణాలను ప్రభుత్వం రద్దు చేయడంతో రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. దేనితో ఎంతో మంది భారతీయులు విదేశాల్లో చిక్కుపోయారు. విదేశీయులు కూడా భారత్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా చాలా మంది తమ ఆత్మీయులను ఈ లాక్ డౌన్ లో మిస్ అవుతున్నట్టు చెబుతున్నారు. సెలబ్రెటీ లు కూడా తమ వారు విదేశాల్లో చిక్కుకున్నారు అని బాధ పడుతున్నారు.

తమిళ హీరో విజయ్ తనయుడు కెనడాలో చిక్కుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు కూడా విదేశాల్లో ఇరుక్కుపోయాడు. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా సోదరుడు ఆనంద్ కూడా అమెరికాలో చిక్కుకుపోయారట. ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కొన్నాళ్ల క్రితం తన తమ్ముడు ఆనంద్ భాటియాతో సరదాగా కింద కూర్చుని ఫోటోలకు పోజులిచ్చిన దృశ్యాలను మరియు తన కుటుంబ సభ్యులతో పంచుకున్న అనుభవాలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా నా తమ్ముడు యుఎస్ లో చిక్కుకుపోవడంతో తనను చాలా మిస్ అవుతున్నాను అంటూ భావోద్వేగంతో కామెంట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here