పేపర్ బాయ్.. అనే పేరు చాలావరకు మన నోటి వెంట వచ్చే ఉంటుంది. పేపర్ బాయ్ అనే సినిమా కూడా వచ్చింది. అంతేకాదు.. ప్రతీ గ్రామంలో, పట్టణంలో, నగరాల్లో ఇలాంటి పేపర్ బాయ్స్ ఉండే ఉంటారు. అలా వాళ్లు ఉదయం పార్ట్ టైంగా చేసుకుంటూ ఫుల్ టైంలో ఏదో జాబ్ చేసే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల టౌన్ లో ఓ వ్యక్తి సైకిల్ పై తిరుగుతూ పేపర్ వేస్తున్నాడు.

అతడి వద్దకు ఓ వ్యక్తి వెళ్లి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. అతడు ఆసక్తికరంగా సమాధానాలు చెబుతాడు. ఈ వీడియో మంత్రి కేటీఆర్ వరకు వెళ్లింది. ఆ బాయ్ చెప్పే సమాధానాలు మంత్రికి ఎంతగానో నచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు.. జగిత్యాల టౌన్ లో ప్రకాశ్ అనే బాలుడు పేపర్ బాయ్ గా పని చేస్తున్నాడు. రోడ్డుపై అతడు వెళ్తుండగా.. మరో వ్యక్తి అతడి దగ్గరకు వెళ్లి.. ఇలా అడిగాడు. ఏ స్కూల్ నీది అని అడగ్గా.. జై ప్రకాశ్.. ప్రభుత్వ పాఠాశాల్లో చదువుతున్నా అంటూ చెబుతాడు.
Loved this video from Jagtial Town
— KTR (@KTRTRS) September 23, 2021
This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression ????????
He says what’s wrong in working while studying & goes on to say it’ll keep him in good stead in future pic.twitter.com/Ug4wYIGn8a
మరి ఈ ఏజ్ లో ఏం చేస్తున్నావ్ అంటూ అడగ్గా.. ఏం ఈ ఏజ్ లో పేపర్ వేయవద్దా.. ఏమైనా తప్పు ఉందా అంటూ అడుగుతాడు. చదువుకునే ఏజ్ లో ఏంటి ఇది అంటూ అడుగుతాడు.. చదువుకుంటూనే ఇలా చేస్తున్నాను అని అతడు సమాధానం చెబుతాడు. అయితే అతడు ఈ సంభాషణ అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఇప్పుడు కష్టపడితేనే.. భవిష్యత్తు అంటూ అతడు చెప్పడంతో.. ఈ మాటలు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తెగనచ్చాయి. అతడితో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. అతడి విశ్వాసం, ఆలోచన, చెప్పే విధానం చూస్తుంటే ముచ్చటేస్తుందంటూ.. అతడిని ప్రశంసిస్తూ కేటీఆర్ ప్రకాశ్ కు సంబంధించి వీడియోను ట్వీట్ చేశాడు.
































