హుజరాబాద్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పై మంత్రి తలసాని స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

కాగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలను అమలు చేస్తారాని అని ప్రశ్నించారు.



































