Miss World 2025 : హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ హఠాత్తుగా తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలుత ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పాల్గొనలేదని భావించినప్పటికీ, ఆ తర్వాత ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆమె అసలు నిజాలు వెల్లడించింది. అందాల పోటీలో తనను కొందరు అసభ్యంగా చూశారని, వేధింపులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనతో మనస్తాపం చెందిన మిల్లా మాగీ పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా, 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోటీలు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలేలో యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా మరియు కరేబియన్ ఖండాల నుంచి ఎంపికైన 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ఈ నెల 31న గ్రాండ్ ఫినాలే జరగనుండగా, ప్రపంచ విజేత ఎవరో తేలనుంది. అయితే, మిస్ వరల్డ్ హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్స్‌కు మిస్ ఇండియా నందిని గుప్తా ఎంపిక కాకపోవడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి.
Shocking 😳 ❗️
— ARPITHA PRAKASH (@ARPITHABRS) May 24, 2025
Miss England fled from Hyderabad because she was made to feel like a ‘prostitute’!
“We weren’t there to entertain wealthy men who help the government,” says Miss England Milla Magee who left the contest midway
This is SICK 😡
Were Miss World contestants… pic.twitter.com/XfduOeQY1c
So sad to hear this.
— YSR (@ysathishreddy) May 24, 2025
Miss England walking out of Miss World in Hyderabad, calling it “exploitative” and saying she felt “like a prostitute” this isn’t just Telangana’s shame, it’s India’s insult.
We demand a full enquiry & strict action.#MissWorldScandal #MissWorld2025 pic.twitter.com/NH87QHizx3



























