అమెరికాపై ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కరోనాతో విలవిలలాడిన అమెరికా ఇప్పుడే కోలుకుంటున్న తరుణంలో భీకర తుపానుతో మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. ఈ తుఫానుతో అక్కడి వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. సాధారణంగా నదులు ఒకే దిశలో ప్రవిహిస్తూ.. ముందుకు సాగుతాయి. కానీ ఇక్కడ తుఫాను ధాటిని ఏకంగా నదులు తన ప్రవాహ దిశను మర్చుకున్నాయి. అంతలా ఇడా హరికేన్ భయపెడుతోంది.

ఇడా ధాటికి అక్కడి న్యూ ఓర్లీన్స్ సమీపంలో మిస్సిస్సిప్పి నది తిరిగి రివర్స్ దిశలో పయనిస్తుండటమే పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రమాదకరమైన 4వ కేటగిరీకి చెందిన తుపానుగా మారిన ఇడా.. లూసియానా తీరప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రచండ గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
కరెంట్ కట్ అవ్వగా.. చాలా ప్రాంతాలు అంధకారం అయ్యాయి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం కత్రినా హరికేన్ విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం అంతటి ఉ ధృతిలో ఈ ఇడా హరికేన్ వచ్చినట్లు అక్కడి నిపుణులు వెల్లడించారు. ఆగ్నేయ లూసియానా మీదుగా.. ఉత్తరం వైపునకు కదిలిన ఇడా హరికేన్… మెక్సికో ఉత్తర గల్ఫ్‌ను దాటి లూసియానా తీరాన్ని తాకింది.
న్యూ ఒర్లాన్స్కు దక్షిణాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ ఫోర్చౌన్ వద్ద తీరాన్ని తాకినట్లు అమెరికా జాతీయ హరికేన్ సెంటర్ వెల్లడించింది. ఈ సమయంలో తుపాను విలయం సృష్టించింది. దీంతో లూసియానా తీరప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. మిస్సిసిపి తీరంలోని అధికారులు సైతం అలర్టయ్యారు. గల్ఫ్‌పోర్ట్‌లో తరలింపుదారుల కోసం సూచనలు, హెచ్చరికలు చేస్తూ రెడ్‌క్రాస్ షెల్టర్ బోర్డు పెట్టారు.