నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. మూడు లక్షల మంది జాబ్ ప్రొవైడర్లతో..?

0
151

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కోసం ఉద్యోగాలు కోల్పోయిన వారితో పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలో నిరుద్యోగుల రేటు అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త స్కీమ్ ను అమలు చేయనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా మూడు లక్షల జాబ్ ప్రొవైడర్లను తీర్చిదిద్దనుందని సమాచారం

కేంద్రం మూడు లక్షల మంది జాబ్ ప్రొవైడర్ల ద్వారా లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. నిరుద్యోగులకు జాబ్ ప్రొవైడర్ల ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. యువతకు ఎక్కువగా కేంద్రం ప్రాధాన్యత ఇవ్వనుందని ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగుల కష్టాలకు దాదాపు చెక్ పెట్టనుందని సమాచారం. ఇప్పటికే కేంద్రం ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించింది.

స్కిల్స్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ స్కీమ్ కు సంబంధించిన నివేదికలను సిద్ధం చేసిందని త్వరలో కేంద్రం ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలులో రాష్ట్రాల సహకారం తీసుకోనుందని.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంట్రప్రెన్యూర్లను గుర్తించి కేంద్రానికి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.

పీఎం ఉద్యం మిత్రా ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ పేరుతో మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేయనుందని తెలుస్తోంది. ఎంట్రప్రెన్యూర్లకు కేంద్రం సంవత్సరంన్నర శిక్షణ ఇవ్వనుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here