Mohan Babu: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ మందిరం ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. కనీవిని ఎరుగని రీతిలో ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ఈ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, క్రీడారంగం వారు ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

ఇప్పటికే సెలబ్రిటీలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు అందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా పంపారు. నేడు అనగా 21వ తేదీన కొందరు అక్కడికి చేరుకోనుండగా మరికొందరు రేపు అనగా 22వ తేదీ అక్కడికి చేరుకోనున్నారు. అయితే తనకు కూడా అయోధ్యకు ఆహ్వానం అందింది అని తెలిపారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. తాజాగా ఫిలింనగర్ లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు అయోధ్యకు ఆహ్వానం అందినప్పటికీ భయపడి తాను వెళ్లలేదని చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి ఏ విషయంలో మోహన్ బాబు భయపడ్డారు ఆయన ఏం చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే.. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులు ఉన్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు.
భయపడి వెల్లలేదు..
అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://youtu.be/1UxwX8raSg4































