జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ పేరు తెచ్చుకున్న వ్యక్తి అవినాష్. అతడికి అందులో వచ్చిన ఫేమ్ ఆధారంగానే బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం వచ్చింది. అందులోకి వెళ్లేముందే ఇక జబర్దస్త్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పాడు. దీంతో అతడు ఆరోజు నుంచి మల్లెమాలకు గుడ్ బై చెప్పేశాడు. మా టీవీలో వచ్చే ప్రతీ ప్రోగ్రాంలో ఎంటర్ టైన్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతూ.. నవ్విస్తూ.. ముందుకు సాగుతున్నాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం అరియానాతో స్నేహం చేశాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు అందరినీ నవ్వించాడు. బెస్ట్ ఎంటర్ టైనర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అరియానాతో అతడి స్నేహం కొనసాగింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక అరియానా, అవినాష్ అనేక ఈవెంట్లు కలిసి చేసినా, గోవా ట్రిప్‌కి వెళ్లినా అరియానాను కాదని అనూజను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు.
ఇది అభిమానులకు షాక్ ను గురిచేసింది. అందరూ అవినాష్, అరియానాకు మధ్య ప్రేమ బంధం ఉందని అనుకున్నారు.. కానీ అది నిజం కాదని..తాము కేవలం స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఇటీవల అనూజని నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ.. తమ పెళ్లి త్వరలో జరగనుందని ప్రకటించాడు.
తర్వాత చాలా రోజులకు మళ్లీ అవినాష్ పెళ్లికి సంబంధించిన విషయం బయటకు వచ్చింది. అతడికి రెండు, మూడు రోజుల్లో పెళ్లి జరగనుండగా.. ఇటీవల అతడు హల్దీ వేడుకును ఘనంగా జరిపించారు. అతడి స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీంతో సీనీ పరిశ్రమకు సంబంధించి నటులు, నటీమనులు పెద్ద ఎత్తున అవినాష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.































