Murali Mohan: సొంతూరులో ఉన్న ఇంటి కోసం కోట్లు ఖర్చు చేస్తున్న మురళీమోహన్.. ఎందుకో తెలుసా?

0
144

Murali Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి వచ్చి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. ఇలా రాజకీయాలలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మురళీమోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇకపోతే తాజాగా మురళీమోహన్ తన సొంత గ్రామంలో ఉన్న ఇంటిని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రీ మోడలింగ్ చేయిస్తున్నారు. మురళీమోహన్ ఏలూరు జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఇక్కడ ఈయన తాతల కాలం నాటి ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అప్పట్లో ఇటుకలు మట్టితో నిర్మించిన ఈ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో మురళి మోహన్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ఇంటి నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేకుండా రీ మోడలింగ్ చేస్తున్నారు.

కన్నతల్లిని పుట్టిన ఊరుని ఎప్పుడు మర్చిపోకూడదు అనే విషయాన్ని మదిలో ఉంచుకున్నటువంటి మురళీమోహన్ తన సొంత ఊరిలో ఉన్నటువంటి తన తాతల కాలంనాటి ఇంటిని రీ మోడలింగ్ చేస్తున్నారు. అయితే ఇదివరకు ఈ ఇంట్లో గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ప్రాథమిక వైద్యశాల ఉండేది. అయితే ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో వైద్యశాలను అక్కడి నుంచి తొలగించారు.

Murali Mohan: గ్రామ ప్రజల అవసరాలకే ఉపయోగిస్తాను..

ఇక ఈ ఇంటి గురించి మురళీమోహన్ మాట్లాడుతూ తాను ఇదే ఇంటిలో పుట్టి పెరిగానని ఈ ఇంటిలోనే తన విద్యాభ్యాసాలు పూర్తి అవ్వడమే కాకుండా తన వ్యాపారాలు కూడా ఈ ఇంటి నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు.ఈ ఇల్లు నిర్మించి దాదాపు 98 సంవత్సరాలు అవుతుంది అయితే శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఇంటిని తిరిగి అదే రూపురేఖలతో రీ మోడలింగ్ చేయిస్తున్నానని తెలిపారు.ఇలా ఈ ఇల్లు రీ మోడలింగ్ పూర్తి అయిన తర్వాత ఈ ఇంటిని గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఉపయోగిస్తానని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు.