వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేయించుకున్న అలనాటి తార అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి మరణించినప్పటికీ ఇప్పటికీ ఆమెపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు.ఇక శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జాన్వికపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతిపోగొడుతుంటారు.ఈ క్రమంలోనే జాన్వికపూర్ ఓ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తన పెళ్లి ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా కేవలం రెండు రోజులలో సాంప్రదాయ పద్ధతిలో జరిగిపోవాలని, తన పెళ్లి తిరుపతిలో చేసుకోవాలనే కోరిక ఉందని తెలిపారు.మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో తన తల్లి ఉన్న ఇంటిలో జరగాలని పెళ్లి మాత్రం తిరుపతిలోనే చేసుకుంటానని తెలిపారు.
ఈ విధంగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన తల్లి పై ఉన్న అభిమానానికి గుర్తుగా తను పుట్టి పెరిగిన ప్రాంతాలలోనే తన పెళ్లి చేసుకోవాలని భావిస్తూ తన తల్లి పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక తనకు కాబోయే వరుడు బాగా తెలివైనవాడు అయితే చాలని, ఈ సందర్భంగా తనకు కాబోయే వరుడు ఏవిధంగా ఉండాలో కూడా జాన్వి కపూర్ తెలియజేశారు.































