Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక నేడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఇంత మంచి సక్సెస్ అందుకున్నారు అంటే అందుకు కారణం నాగబాబు అని కూడా చెప్పాలి.

ప్రతిక్షణం పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ ఆయన విజయానికి కారణమయ్యారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్రాంతంలో కూటమినేతలు భారీ మెజారిటీతో గెలిచారు.

Nagababu: గేమ్ ఛేంజర్..
ఈ క్రమంలోనే పవన్ పేరు దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇలాంటి తరుణంలోనే పవన్ సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రతి నాయకుడు హీరో అవుతాడు కానీ ప్రతి హీరో నాయకుడు కాలేరు. నాయకుడు అంటే నమ్మిన సిద్ధాంతాలను సైధ్దాంతిక విలువల కోసం. అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం. నీడై నిలబడేవాడు. తోడై నడిపించేవాడు. వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు. వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు.ప్రస్తుతం దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు. ఇలా పవన్ గురించి నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
































