Nagachaitanya: విడాకులపై మరోసారి స్పందించిన నాగచైతన్య… సాగదీయడం తప్పంటూ కామెంట్స్!

0
30

Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సమంతకు విడాకులు ఇవ్వడానికి కారణాలను కూడా తెలిపారు.

సోషల్ మీడియాలో తమ గురించి వచ్చిన రూమర్స్ కారణంగానే ఇద్దరు మధ్య గొడవలు పెద్దవయ్యాయని ఆ గొడవల కారణంగానే విడాకులు తీసుకున్నమని తెలిపారు.ఇలా నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్లకు పరోక్షంగా సమంత కౌంటర్ ఇచ్చారు. మనమంతా ఎప్పుడూ ఒకటే కానీ అహంకారం భయం అనేది మనల్ని దూరం చేస్తాయి అంటూ సమంత పోస్ట్ చేశారు.

ఇలా వీరిద్దరూ కామెంట్స్ కనుక చూస్తే ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఈగో వల్లే విడిపోయారని అర్థమవుతుంది. అయితే తాజాగా మరోసారి నాగచైతన్య విడాకుల గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ నేను సమంత రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నాము కానీ ఇప్పటికీ మా విడాకుల గురించి ఏదో ఒక వార్తలు రాస్తూనే ఉంటారని తెలిపారు.

Nagachaitanya: హెడ్ లైన్స్ కోసం సాగదీయడం తప్పు…

ఈ విధంగా మీ హెడ్ లైన్స్ కోసం విడాకుల వార్తలను సాగదీయడం తప్పు అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య మరోసారి విడాకుల గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక నాగచైతన్య గతంలో నటించిన థాంక్యూ సినిమా డిజాస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కస్టడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా తనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.