Nagarjuna: బిగ్ బాస్ 7 కోసం నాగ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…సినిమాలు చేయాల్సిన అవసరం లేదు!

0
37

Nagarjuna: కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు గత ఏడాది ఈయన నటించిన ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ఎలాంటి కొత్త సినిమాలను ప్రకటించలేదు. అయితే నాగార్జున ఇలా సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ 7 ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకు ఒక వార్త వైరల్ అవుతుంది అయితే తాజాగా నాగార్జునకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Nagarjuna: నాలుగు సినిమాలతో సమానం..


ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ఈయన భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఈ రియాలిటీ షో కోసం నాగార్జున ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.నాగార్జున ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే మరో రెండు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాలు చేయకపోయినా పర్వాలేదని ఈ రెమ్యూనరేషన్ నాలుగు సినిమాల కోసం తీసుకునే రెమ్యూనరేషన్ తో సమానం అంటూ నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు.