ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి వారసుడిగా నారా లోకేష్ అందరికీ సుపరిచితమే. ఇదివరకు నారా లోకేష్ అంటే తెల్లని చొక్కా నిండుగా వేసుకుని, క్లీన్ షేవ్ తో ఎంతో నీటుగా, పద్ధతిగా కనిపించడమే గుర్తొస్తుంది. కానీ నారా లోకేష్ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే తన లుక్ మొత్తం మార్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో కూర్చొని నారా లోకేష్ హీరో లెవల్లో మాస్ లుక్ ట్రై చేశాడు.

ఈ విధంగా నారా లోకేష్ తన లుక్ మొత్తం చేంజ్ చేయడానికి గల కారణం ఏంటనే ప్రశ్న ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. తీరిక లేక ఈ విధంగా తయారయ్యాడా లేక మాస్ అభిమానులను ఆకట్టుకోవడం కోసం ఈ విధంగా తన లుక్ మార్చాడా అనే సంగతి తెలియడం లేదు.ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే నారా లోకేష్ ఒక్కసారిగా గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

నారా లోకేష్ తన కొత్త లుక్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించడం వల్ల పెద్దగా ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. అయితే ప్రస్తుతం తన మాస్ లుక్ ద్వారా అందరికీ దగ్గర కావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా గడ్డం పెంచారని తెలుస్తోంది. అయితే ఎప్పుడు చొక్కాలో కనిపించే నారా లోకేష్ ఈసారి టీ షర్ట్ లో కనిపించడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నారని ప్రకటించడంతో ఈ విషయం పై నారా లోకేష్ స్పందించారు. కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా పరీక్షలను నిర్వహించడాన్ని నారా లోకేష్ వ్యతిరేకించాడు.ఈ విషయంలో విద్యార్థులకు మద్దతుగా విద్యార్థులను ఆకట్టుకోవడానికి నారా లోకేష్ ఈ లుక్ లో కనిపించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here