Natti Kumar : రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు అన్నీ కామన్. కొన్నిసార్లు ఆ విమర్శలు ప్రజలలోకి బాగా వెళ్తాయి. ఒక్కోసారి అవి నిజమే అయ్యుండొచ్చు కానీ కొన్నిసార్లు వ్యూహం లో భాగంగా ప్రత్యర్థి పార్టీ మీద బురద జల్లి లబ్ది పొందాలని చూడొచ్చు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. అదికూడా అధికార పక్షం చేయించింది అంటూ విమర్శలు. దీని కోసం ఆయన ఇంటివద్ద రెక్కి నిర్వహించారు, 250 కోట్ల డీల్ ఆయనను చంపడానికి చేసారంటూ జనసేన నాయకులు ప్రభుత్వం మీద ఆరోపణలు చేసారు. అయితే వైసీపీ నాయకులు ఆయనను చంపాల్సిన అవసరమేంటి, ఆ పని చంద్రబాబు చేయించుండొచ్చు లేక మీరే అనవసర ఆరోపణలను చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు.

పవన్ మీద హత్య కుట్ర అపద్ధం…
నిర్మాత నట్టి కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద హత్యా యత్నం చేసేంత ధైర్యం ఎవరికీ లేదు. వంగవీటి రంగ తరువాత అంతటి జనాధరణ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదంతా చంద్రబాబు ఇచ్చిన సలహాలు అయ్యుండొచ్చు పవన్ కళ్యాణ్ కి. ప్రజలలో ఉన్న మనిషి మీద ప్రమాదం తలపెడితే లాభం జనసేన పార్టీ కే కానీ వైసీపీ కి రాదు. ఇలాంటి రాజకీయాలు చంద్రబాబు చేయగలడు. రాజశేఖర్ రెడ్డి కానీ ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కానీ రెక్కి నిర్వహించడం వచంపాలని చూడటం ఇవ్వన్నీ చేయలేదు.

నెక్స్ట్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని చంద్రబాబు కూటమి ప్రకటిస్తే జగన్ కి పోటీ పవన్ ఇవ్వగలడు కానీ లేకపోతే జగన్ మళ్ళీ గెలిచి సీఎం అవ్వడం ఖాయం. కాపు ప్రజలంతా పవన్ ను సీఎం గా చూడాలని అనుకుంటున్నారు. ఇక జగన్ పాలన బాగుంది అంటూ నట్టి అభిప్రాయ పడుతూ అయితే ఆయన దగ్గర ఉన్న కొంతమంది సలహాదారులు పోలీసులు కొంచెం ప్రతిపక్షాలకు ప్లస్ అయ్యే పనులు చేస్తూ జగన్ కి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేస్తున్నారు అది ఆయన గమనించుకుంటే మంచిది అంటూ హితవు పలికారు.































