Nayanatara: సౌత్ ఇండియన్ స్టార్ హీరో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈమె నెట్ ఫ్లిక్స్(Netflix ) లో తన డాక్యుమెంటరీ ప్రసారమవుతున్న సమయం నుంచి వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలో హీరో ధనుష్ (Danush) నిర్మించిన సినిమా నుంచి నయనతార కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నారు కానీ వాటికి ఎలాంటి పర్మిషన్ లేదని ధనుష్ ఏకంగా ఈమెకు 10 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ నోటీసులు పంపిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయం గురించి నయనతార ధనుష్ మధ్య ఓ రేంజ్ లో వివాదం జరిగింది.

ఇలా నయనతార ధనుష్ వివాదం అలాగే కొనసాగుతోంది. ధనుష్ పంపిన పది కోట్ల రూపాయల లీగల్ నోటీసు పట్ల నయనతార మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. నయనతార ప్రకటనకు ధనుష్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నేరుగా ఆమెపై చెన్నై హైకోర్టులో కేసు చేశాడు ధనుష్. ముఖ్యంగా నయనతారతో పాటు తన భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) తో పాటు సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై కేసు వేశాడు ధనుష్.. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరారు అయితే ఈ పిటిషన్ విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని నయనతారను కోరారు.

Nayanatara:
ఇలా ఈ వివాదం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే నయనతార సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ధనుష్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు.. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ మీరు ఒక అబద్ధం చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు అది అప్పుగా తీసుకోబడుతుంది. కర్మ ఎప్పుడు ఎవరిని ఊరికే వదిలి వెళ్ళిపోదు వడ్డీతో సహా తిరిగి చెల్లించి వెళ్తుంది అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారో అన్నది తెలియజేయకపోయిన పక్కాగా హీరో ధనుష్ ను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం నయనతార చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.































