Net Flix: స్టార్ హీరోయిన్ ను ఘోరంగా అవమానించిన నెట్ ఫ్లిక్స్… లీగల్ నోటీసులు జారీ చేసిన నటి!

0
80

Net Flix: కరోనా సమయంలో ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇలా ఓటీటీలలో పెద్ద ఎత్తున సినిమాలు వెబ్ సిరీస్లో పలు టాక్ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. అయితే ఎంతోమంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నటువంటి వాటిలో నెట్ ఫ్లిక్స్ ఒకటి. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ సమస్తకు ప్రముఖ నటి లీగల్ నోటీసులు జారీ చేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి నటి మాధురి దీక్షిత్ అవమానానికి గురయ్యారు. నెట్​ఫ్లిక్స్​లో టెలికాస్ట్ అవుతున్న అమెరికన్ సిట్​కామ్ ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్​పై ఇప్పుడు దుమారం రేగుతోంది.

ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్​లో మాధురీ దీక్షిత్​ను సూచించేందుకు ఒక ‘అవమానకరమైన పదాన్ని’ ఉపయోగించారు తద్వారా ఇది తనని పూర్తిగా కించపరిచినట్లేనని రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన నెట్ఫ్లిక్స్ పై దావా వేశారు. ఇందులో ఒక సన్నివేశంలో పేదోడి ‘మాధురీ దీక్షిత్’ అని పేర్కొంటాడు.

Net Flix: మాధురి దీక్షిత్ ను అవమానపరచడమే..


దీనికి మరో పాత్రధారి రాజ్ కూత్రపల్లి క్యారెక్టర్​ను పోషించిన కునాల్ నయ్యర్.. కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్​తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని బదులిస్తాడు. ఇలా మాధురి దీక్షిత్ ను కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉండటంతో ఈ విషయంపై నెట్ ఫ్లిక్స్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు.ఎపిసోడ్​ను తొలగించాలని లేదా మహిళల మీద వివక్షతను ప్రోత్సహించినందుకు గానూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయ్ కోరారు.