Anchor Anasuya: యాంకర్ అనసూయ కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా ఉన్నప్పటికీ ఈమె అనంతరం యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ విధంగా యాంకర్ గా పలుకు కార్యక్రమాలకు ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాని గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చింది.ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా ఇదే పాపులారిటీతో వెండితెర అవకాశాలను కూడా అందుకుంది.

ప్రస్తుతం అనసూయ కెరియర్ ఇలా ఉంది అంటే అందుకు కారణం జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం అనసూయ సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా అనసూయ వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల తనకు బుల్లితెరపై పలు కార్యక్రమాలు చేసే సమయం లేకుండా పోతుందని అందుకే తాను జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు గతంలో పరోక్షంగా వెల్లడించారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా అనసూయకు అదే చివరి ఎపిసోడ్ అని తెలుస్తుంది. ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల తాను బుల్లితెర కార్యక్రమాలు చేయకూడదని భావించుకున్నారట అందుకే జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది.
సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీ కానున్న అనసూయ…
అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతుందని ఈ ప్రోమో ద్వారా తెలియడంతో జబర్దస్త్ కమెడియన్స్ అలాగే జడ్జిలు సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ప్రోమో చూసిన ఎంతోమంది నెటిజన్లు అనసూయకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమం కోసం తన దగ్గర డేట్స్ లేవా?ఈ కార్యక్రమం కోసం రెండు రోజులు సమయం కేటాయించలేవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే అనసూయ వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ పడిపోవడం ఖాయమని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా అందాల యాంకరమ్మను జబర్దస్త్ కార్యక్రమంలో చూడలేకపోతాము అనే వెలితి మాత్రం ప్రేక్షకులలో ఉంటుందని చెప్పాలి.


































