Nivetha Thomas:టాలీవుడ్ ప్రేక్షకులకు నాని సరసన జెంటిల్మెన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి నివేద థామస్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ విపరీతమైన తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు.ఇక ఈమె ఇండస్ట్రీకి మలయాళ సినిమా ద్వారా వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం జెంటిల్మెన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ విధంగా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె తాజాగా శాకిని డాకిని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె గతంలో ఓ మలయాళ నటుడితో ప్రేమలో పడ్డారు అనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఇలా నివేద థామస్ మలయాళం నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని వార్తలు కూడా వినిపించాయి. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ అయిందని అయితే ఆ బ్రేకప్ అవ్వడానికి గల కారణం కేవలం కుటుంబ సభ్యులను తెలుస్తోంది. నివేద థామస్ తాను ప్రేమించిన వ్యక్తి ఇద్దరి కులాలు వేరు కావడం వల్లే తన కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం.

Nivetha Thomas: పెద్దలు అడ్డు చెప్పడం వల్లే…
ఈ విధంగా కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అడ్డు చెప్పడంతో చేసేదేమీ లేక నివేద థామస్ తాను ప్రేమించిన వ్యక్తిని వదులుకున్నారని అలా తన ప్రేమకు బ్రేకప్ అయ్యిందంటూ ఈ సందర్భంగా నివేద థామస్ ప్రేమ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి ఈమె ప్రేమ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.































