Raasi: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా సమర సింహా రెడ్డి. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాకు శ్రీకారం చుట్టిన సినిమా ఇది. దీని తర్వాతే నరసింహ నాయుడు, ఇంద్ర వంటి సినిమాలు వచ్చి బాక్స్ ఫీస్ హిట్లను కొట్టాయి.

బాలకృష్ణ హీరోగా బీ గోపాల్ దర్శకత్వంలో 1999 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. ఏకంగా కొన్ని సెంటర్లలో 200 రోజులు ఆడింది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రూ. 16 కోట్లు వసూలు చేసింది.

అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రావడం, బాలయ్య నట విశ్వరూపం, బీ గోపాల్ దర్శకత్వం ప్రతిభతో సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. బాలయ్య సరసన… సిమ్రాన్, అంజలా జావేరీ, సంఘవిలు నటించారు. అయితే ఇదిలా ఉంటే జనవరి 14తో సమరసింహారెడ్ది సినిమాకు 23 ఏళ్లు నిండాయి.
ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం..
అయితే ఈ సినిమాలో ముందుగా అప్పట్లో ఫ్యామిలీ హీరోయిన్ గా ఉన్న రాశిని ముందుగా ఈసినిమాలో హీరోయిన్ గా అనుకన్నారట. సిమ్రాన్ స్థానంలో రాశిని కథానాయికగా తీసుకోవాలని దర్శకుడు బీ గోపాల్ అనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల రాశి ఈ అవకాశాన్ని వదులుకుందని ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపింది. సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్‌తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దర్శకుడు నటి సిమ్రాన్‌ను కలిసి స్క్రిప్ట్ చెప్పాడట. ఆమెకు కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పిందట సిమ్రాన్. దీంతో సిమ్రాన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కూడా తీసుకువచ్చింది ఈసినిమా. ఒక వేళ రాశి ఈ సినిమాను చేసి ఉంటే.. ఆమె కెరీర్ మరోరకంగా ఉండేది. బాలయ్య వంటి స్టార్ హీరో పక్కన హీారోయిన్ గా నటించకపోవడంపై అప్పట్లో ఓవర్గం రాశిని టార్గెట్ చేశారు.































