NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. మే 28వ తేదీ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుక కావడంతో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే మే 20వ తేదీ హైదరాబాదులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కూడా వస్తారని అందరూ భావించారు. కానీ అదే రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ఎన్టీఆర్ తన తాతయ్య శత జయంతి వేడుకల కన్నా తన పుట్టినరోజు తనకు ఎక్కువ కాదు ఎన్టీఆర్ రావాలనుకుంటే తప్పకుండా వచ్చేవారని కానీ ఎన్టీఆర్ రాకపోవడానికి తన పుట్టినరోజు మాత్రమే కారణం కాదని అందుకు మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు ఈ కార్యక్రమానికి రావడం నందమూరి ఫ్యామిలీ లోని కీలక వ్యక్తికి ఇష్టం లేకపోవడంతోనే వీరిద్దరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సమాచారం.

NTR: ఎన్టీఆర్ రావడం తనకి ఇష్టం లేదా…
నందమూరి కుటుంబ సభ్యులను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆహ్వానించిన కూడా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడం ఆ వ్యక్తికి ఇష్టం లేదనే విషయం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ దృష్టికి రావడంతో తాము వెళ్లి ఇతరులను బాధ పెట్టడం దేనికి అని ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా ఉన్నారని తెలుస్తోంది. మరి ఆ ఇష్టం లేనటువంటి వ్యక్తి బాలకృష్ణ అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ముందు నుంచి కూడా బాలకృష్ణ ఎన్టీఆర్ కి అసలు ఏ మాత్రం పడటం లేదనే విషయం మనకు తెలిసిందే