ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారంకు ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. పండగల సమయంలో, పెళ్లిళ్ల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. బంగారం కొనుగోలు చేస్తే మనకు అవసరమైన సమయంలో బంగారాన్ని తనఖా పెట్టి రుణం పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్లపై ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంటే మరికొన్ని బ్యాంకు మాత్రం తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే బంగారాన్ని తనఖా పెట్టి సులభంగా రుణం పొందవచ్చు. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం బంగారానికి తక్షణమే రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అయితే గోల్డ్ లోన్ తీసుకునే ముందు మొదట బ్యాంకుల వడ్డీరేట్లను పరిశీలించాలి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.5 శాతం నుంచి బంగారు ఆభరణాలపై రుణాలను మంజూరు చేస్తోంది.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం 7 శాతం వడ్డీకే రుణాలను అందిస్తోంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం రుణాలను 7.35 శాతం వడ్డీకి అందిస్తోంది. అయితే గోల్డ్ లోన్ తీసుకోవాలంటే బ్యాంకుల ద్వారా తీసుకోవడమే ఉత్తమం. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.

ఐఐఎఫ్‌ఎల్‌ లో బంగారం రుణాలపై వడ్డీ రేటు 9.24 శాతంగా ఉంది. బజాజ్ ఫిన్‌సర్వ్‌ 11 శాతం వడ్డీరేటుకు రుణాలను అందిస్తోంది. మణపురం ఫైనాన్స్ లో 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుండగా ముత్తూట్ ఫైనాన్స్‌లో 11.9 శాతం వడ్డీ పడుతోంది. తాత్కాలికంగా రుణాలు కావాలంటే గోల్డ్ ఫైనాన్స్ లను, దీర్ఘకాలికంగా కావాలంటే బ్యాంకులను సంప్రదించడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here