Pan India Movies: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన పాన్ ఇండియా చిత్రాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన చేసిన సంచలన వ్యాఖ్యలు మన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలియజేస్తున్నాయి.

ముఖ్యంగా తెలుగు సినిమాల గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసినంత కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా చేయలేకపోతున్నాయి.తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ జరగకపోయినప్పటికీ హిందీలో ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిందని తెలిపారు.

ఉత్తరాది రాష్ట్రాలలో అల్లుఅర్జున్ గురించి పెద్దగా తెలియక పోయినప్పటికీ ఆయన నటించిన సినిమా మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది ఇదే కదా పాన్ ఇండియా క్రేజ్ అంటే.. అసలు ఈ పాన్ ఇండియా అనే పదం పుట్టింది తెలుగులో అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
రాజమౌళి బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా పుట్టింది:
తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం మొట్టమొదటిసారిగా పలు భాషలలో విడుదల అయ్యి పాన్ ఇండియా అనే పదానికి అర్థం తీసుకు వచ్చింది. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేస్తుందని.. తొలిరోజు ఒక్కటే హిందీ వెర్షన్ 30 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నాడు. ఈ విధంగా కరణ్ జోహార్ దక్షిణాది సినీ ఇండస్ట్రీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయనపై ఉత్తరాది నుంచి ట్రోలింగ్ ప్రారంభమైపోయింది.