Pavan kalyan in RRR : ఆర్ఆర్ఆర్ గురించి వార్తలు ఇప్పట్లో ఆగేలా లేవు. రోజు ఏవో ఒక న్యూస్ తో ఈ సినిమా ముచ్చటే. అటు థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది ఆర్ఆర్ఆర్. సౌత్,నార్త్ అనీ తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతోంది ఆర్ఆర్ఆర్. ఇక ఇందులో నటించినా ఎన్టీఆర్ రామ్ చరణ్‌లకు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టాయి.

మొదట అనుకున్నది పవన్ కళ్యాణ్ నా….
ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ ల్లో ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇక ఈయన చెప్పిన విషయంలో ఒకటి మాత్రమే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాకోసం మొదట అనుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అనీ చెప్పారు. ఇక పవన్ సారి సమానమైన క్రేజ్ ఉన్న మరో హీరో లేకపోవడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను తీసుకున్నారట.
పవన్ క్రేజ్….
పవన్ కళ్యాణ్ గొప్ప స్టార్ అని, ఆయనకున్న క్రేజ్, చరిష్మా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేదని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు.ఇక ఈ సినిమా కు కొనసాగింపు గా మరో సినిమా రాబోతోందనే హింట్ కూడా ఇచ్చేసారు విజయేంద్రప్రసాద్ గారు. దీంతో మళ్ళీ అభిమానుల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ రెండో భాగం కనుక వస్తే ఇక ఫ్యాన్స్ కు పండగే.


































