Pavitra Lokesh: పవిత్ర లోకేష్ నరేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ నరేష్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ కొందరు పరిస్థితులను అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా తమ పట్ల వ్యవహరించారని తెలియజేశారు. నా వ్యక్తిత్వ ఖననం చేసి నా కెరియర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూసారు. దీని నుంచి బయటకు రావడానికి చాలా కష్టం అనిపించిందని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ తెలియజేశారు.ఆ సమయంలో నేను ఒంటరిగా ఇంట్లో అయినా కూర్చోవాలి లేదా ఆత్మహత్య ఒకటే మార్గమని అనిపించింది.
ఇలా కాకుండా నేను బయటకు తిరిగాను అంటే అందుకు కారణం నరేష్ అని ఈమె తెలియజేశారు. నరేష్ గారు నా వెనుక నిలబడి నన్ను ముందుకు నడిపించారు.నేనున్నానని ధైర్యం కల్పించారు. అప్పుడు నేను ఒక్క అడుగు వెనక్కి వేసిన ఎంతో దారుణం జరిగి ఉండేదని, నరేష్ చాలా సపోర్ట్ గా ఉండేవారని ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ తెలియ చేసారు.

Pavitra Lokesh: మహేష్ బాబు యాక్సెప్ట్ చేశారు…
విజయ్ నిర్మల గారిని కూడా కలిశానని అయితే నేను తనని కలిసే సమయానికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారని తనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం తనకు లేకుండా పోయిందని పవిత్ర లోకేష్ తెలియజేశారు. ఇక కృష్ణ గారితో ఎక్కువ సమయం గడిపామని తనతో ఎన్నో విషయాలు గురించి కూడా మాట్లాడమని పవిత్ర లోకేష్ తెలిపారు. ఇక మహేష్ బాబు గారు కూడా తమ రిలేషన్ యాక్సెప్ట్ చేశారు అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.