Nidhi Agarwal: నిధి అగర్వాల్ ది లక్కనే చెప్పవచ్చు. కెరీర్ బిగినింగ్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో ఈ అమ్మడు చాలా సంతోష పడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో తన కోరిక తీరిందంటుంది నిధి అగర్వాల్.

ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న హీరో చిత్రంలో కథానాయికగా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సందడి చేస్తుంది నిధి అగర్వాల్.

దీంతో పాటు తమిళంలో కూడా పలు సినిమాకు కమిట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ శింబుతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Nidhi Agarwal : కెరీర్ బిగినింగ్‌లోనే పవన్‌తో..
పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్ వస్తున్న మూవీ ‘హరిహర వీరమల్లు’. ప్యాన్ ఇండియా మూవీగా, పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో నిధి పంచమి పాత్రలో నటిస్తుంది. కెరీర్ బిగినింగ్‌లోనే పవన్‌తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది నిధి. తాజాగా హీరో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె స్పందిస్తూ హరిహర వీరమల్లు చిత్రం గురించిన అప్‌డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ యాబై శాతం పూర్తయినట్లు వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభంలో హరిహరవీరమల్లు వంటి సినిమాలో పవన్ కళ్యాణ్ వంటి పెద్ద స్టార్ తో నటించడంతో పాటు.. యాక్షన్ సినమాల్లో నటించాలన్న తన కోరిక తీరిందని నిధి అగర్వాల్ చెప్పింది. ఈ సినిమాలో తను యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించినట్లు వెల్లడించింది. ఈ సినిమా తన కెరీర్ లో నెక్ట్ లెవల్ మూవీ అవుతుందని నిధి అగర్వాల్ అంటోంది.































