Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ వైకాపా మంత్రి పేరుని నాని ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి షిప్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే

ఈ విషయం గురించి పేర్ని నాని మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ కాకపోయినప్పటికీ తన ప్రాణాలకు తెగించి మరీ సముద్రంలోకి వెళ్లినందుకు తనని ప్రశంసిస్తున్నానని తెలిపారు..అనుభవమున్న రంగం కాబట్టి షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో భాగంగా రెండు నెలల నుంచి నాకు ఇక్కడకు రావడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు కష్టమ్స్ ఆఫీసర్, పోర్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా బోర్డు లోనే ఉన్నారు మరి ఆయనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒకటి చంద్రబాబు నాయుడు అయినా తనకు అనుమతి తెలపక పోవాలి లేదంటే పవన్ కళ్యాణ్ అయిన అబద్ధం చెప్పి ఉండాలని పేరుని నాని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేశారు సీజ్ ద షిప్ అని కెన్ స్టార్ షిప్ ను ఎందుకు అనలేదని, ఆ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు. ఆ షిప్ లో అక్రమంగా బియ్యం రవాణా జరిగి ఉండదా అంటూ ఈయన సరికొత్త సందేహాలను వ్యక్తపరిచారు.స్టెల్లా షిప్ ను 36 మంది ఎక్స్ పోర్టర్లు 35 వేల టన్నులు ఎక్స్ పోర్టు కోసం తెచ్చుకున్నారు. కెన్ స్టార్ షిప్ లో ఒకే ఎక్స్ పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం ఎక్స్ పోర్టు చేస్తున్నారు.

Pawan Kalyan: పయ్యావుల కేశవ్..
మరి పవన్ కళ్యాణ్ ఎందుకని కెన్ స్టార్ షిప్ దగ్గరకు వెళ్లలేదు అంటూ ఈయన ప్రశ్నించారు ఎందుకంటే ఆ షిప్ స్వయానా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు వేల్పూరి శ్రీనుకి సంబంధించినది కావటం విశేషం. అందుకనే పవన్ కళ్యాణ్ ఈ షిప్ వద్దకు వెళ్లలేదు అంటూ సరికొత్త సందేహాలను బయటపెట్టారు.


































