మంత్రి పేర్నినానితో సీనీ నిర్మాతల బృందం భేటీ ముగిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో భేటీ సందర్భంగా.. ఆన్ లైన్ టికెట్స్, సీనీ పరిశ్రమపై చర్చించారు. ఆన్ లైన్ టికెట్ అనేది తాము కొద్దగా పెట్టిందికాదని.. ప్రభుత్వం కంటే కూడా సినీ పరిశ్రమే ఆన్ లైన్ టికెటింగ్ కు బాగా అనుకూలంగా ఉందన్నారు మంత్రి.

సహజంగా సినిమా టికెట్లపై ఒక నిర్దిష్ట విధానం అనేది ఉండాలి. అది చాలా అవసరం కూడా. అందుకే.. ఆన్ లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతుంది. కాబట్టి.. కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు.. ఇది మా ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టింది కాదంటూటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. టికెట్ రేటు కనుక తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని, ప్రోడక్షన్ కాస్ట్ కూడా పెరిగిందని దీనిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా నిర్మాతల బృందం తెలిపినట్లు మంత్రి చెప్పారు.

దీనిపై పలువురు నిర్మాతలు మాట్లాడారు. లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెటింగ్ విధానం గురించి మాట్లాడటానికి వచ్చామని.. ఎవడో .. ఏదో మాట్లాడితే తమకు సంబంధం లేదని.. దీనిని దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత అన్నారు. సినీ పరిశ్రమను నమ్ముకొని వేల మంది ఉన్నారని.. అలాంటి వాళ్లకు రాజకీయ రంగు పూయొద్దని అన్నారు.
ఇలా సినీ నటీనటుల కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు అతడు అంటుంటే.. ఇలా పేర్ని నానిని సినీ ప్రముఖులు కలవడం చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పేర్ని నానితో భేటీ అయిన వారిలో సీని నిర్మాతలు దిల్ రాజ్, డీవీవీ దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి, మైత్రి ననీన్ ఉన్నారు.































