కరోనా మహమ్మారి దేశ ప్రజల ఆలోచనలను, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల పెద్దపెద్ద వ్యాపారాలు చేసిన వాళ్లు సైతం కోట్ల రూపాయలు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు గతంతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గింది. అయితే కేంద్రం దేశంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక పథకాన్ని అమలు చేస్తోంది.

ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 25 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసి ప్రయోజనం పొందవచ్చు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందాలని అనుకునే వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తూ వ్యాపార రంగంలో కెరీర్ ను ఎంచుకునే వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుని అర్హత సాధిస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చు. చాలా సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అమలవుతున్నా కరోనా విజృంభణ వల్ల ఈ స్కీమ్ గురించి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ వెబ్ సైట్ ద్వారా కేంద్రం నుంచి రుణం పొందిన వాళ్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వాళ్లు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందలేరు. కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేస్తే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here