ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే కాంబో మరొకసారి రిపీట్ కానుందని చిత్ర బృందం ప్రకటించారు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్‌సింగ్”అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ అఖిల్ పూజా హెగ్డే నటించినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ… హీరో అఖిల్ ని అభినందించిన ఆయన పూజాహెగ్డేను మాత్రం ప్రత్యేకంగా అభివర్ణించాడు. కరోనా సమయంలో అందరూ ఖాళీగా ఉన్నప్పటీకీ పూజ మాత్రం ఎంతో బిజీగా ఉన్నారని శంకర్ పూజ గురించి తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈమె వరుసగా అఖిల్, బన్నీ, చెర్రీ, పవన్ కళ్యాణ్, మహేష్ అంటూ టకటక హీరోల పేర్లు చెబుతూ నోరు జారారు. తనకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోందన్న విషయాన్ని డైరెక్టర్ శంకర్ బయటపెట్టారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ వేడుకలో డైరెక్టర్ హరీష్ శంకర్ అధికారికంగా తెలియజేశారు.
































