Pooja Hegde: సొంత ఇంటిని నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆశ పడుతూ సొంత ఇంటి కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇలా సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడతారు. తాజాగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పూజా హెగ్డే ముంబైలో ఓ ఇంటిని నిర్మించుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం పూజా హెగ్డే తన కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా పూజా హెగ్డే గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పూజా హెగ్డే సంప్రదాయ దుస్తులను ధరించి గృహప్రవేశానికి సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చెబుతూ… ఈ కొత్త ఇంటి నిర్మాణం ఏడాది నుంచి జరుగుతుందని ఇలా అన్ని కలలు నెరవేరినందుకు మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడి పనిచేయండి. ఇలా కష్టపడి పని చేసినప్పుడే ఈ విశ్వం మొత్తం మీతో ప్రేమలో పడుతుంది అప్పుడే మీ కలలు నెరవేరుతాయి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
రెట్టింపు అందంతో ఆకట్టుకున్న బుట్ట బొమ్మ..
ఈ విధంగా పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్ చేస్తూ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో పూజా హెగ్డే రెట్టింపు అందంతో అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ఈమె నటించిన ఆచార్య, రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


































