Prabhas -Nithya Menon:తెలుగు చిత్ర పరిశ్రమలోకి అలా మొదలైంది సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్. ఈమె అలా మొదలైంది సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలా తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి నిత్యమీనన్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈమె ప్రభాస్ ఎవరో తెలియదంటూ చెప్పిన సమాధానం ఈమెను ఎంతగానో బాధ పెట్టింది.

ప్రభాస్ తెలియదని చెప్పడానికి గల కారణం ఏంటి అసలేం జరిగింది అనే విషయానికి వస్తే… తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో ఈమె అలా మొదలైంది సినిమా ద్వారా మంచి గుర్తింపు అందుకున్నారు. అయితే ఈ సినిమా అనంతరం తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా తనకి ప్రభాస్ గురించి ప్రశ్నించారు.ప్రభాస్ ఎవరో మీకు తెలుసా అంటూ ప్రశ్నించగా తనకు ప్రభాస్ తెలియదని సమాధానం చెప్పారు.
ఈ విధంగా నిత్యామీనన్ ప్రభాస్ తెలియదని చెప్పడంతో అప్పట్లో ప్రభాస్ అభిమానులు తనని దారుణంగా ట్రోల్ చేశారని ఆ విషయం తనని చాలా బాధపెట్టిందంటూ ఈమె తెలిపారు. నిజానికి తాను మలయాళీ అమ్మాయి కావడంతో తెలుగు సినిమాలను పెద్దగా చూసేది కాదట.తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం చిరంజీవి బాలకృష్ణ వంటి వారు మాత్రమే తెలుసని ప్రభాస్ తెలియకపోవడంతో తనకు తెలియదని సమాధానం చెప్పానని వెల్లడించారు.

తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని కాదు..
ఈ విధంగా ప్రభాస్ తెలియదని చెప్పడంతో తనని బాగా వ్యతిరేకించారని ఇండస్ట్రీలో తనని ట్రోల్ చేశారంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అప్పట్లో ప్రభాస్ విషయంలో నిత్యమీనన్ చేసినటువంటి కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి అయితే తాజాగా మరోసారి గతంలో నిత్యమీనన్ ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































