కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం రైతుల కొరకు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీతో కేంద్రం జతకట్టి ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రైతులకు నెలకు మూడువేల రూపాయల చొప్పున పెన్షన్ ను ఇస్తోంది. రైతులు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన యోజన స్కీమ్ కు రైతులు అర్హత పొందాలంటే రైతులు సాధారణంగా కొంత మొత్తం ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇకపై రైతులు ప్రీమియం చెల్లించల్సిన అవసరం లేకుండా కేంద్రం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం దేశంలోని రైతులు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు పొందుతున్న సంగతి తెలిసిందే.

ఇకపై కేంద్రం పీఎం కీసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ లో చేరిన రైతుల ప్రీమియాన్ని పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా పొందే నగదుకు బదులుగా చెల్లించనుంది. తద్వారా రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా లభించే ఆరువేల రూపాయలు వృద్దాప్యంలో నెలకు 3 వేల రూపాయల చొప్పున పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు ఇకపై ఏ రైతు కూడా ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సును బట్టి 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దేశంలోని 21 లక్షల మంది రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here