Priyanka Chopra: సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే నటనతో పాటు అందం కూడా ఎంతో ప్రాధాన్యతన సంతరించుకుంటుంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ కూడా తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇక మరికొందరు సెలబ్రిటీలు అయితే ఏకంగా తమ శరీర భాగాలకు సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు.

కొన్నిసార్లు ఈ సర్జరీల కారణంగా ఉన్న అందం కూడా పోయి అందవిహీనంగా మారుతూ ఉంటారు. మరికొందరు సర్జరీలు వికటించి మరణించిన వారు కూడా ఉన్నారు.అయితే తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సైతం తనకు సర్జరీలు జరిగాయని అయితే సర్జరీ కారణంగా తన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దాదాపు 20 సంవత్సరాల క్రితం తనకు పెదాలకు ముక్కుకు సర్జరీ జరిగిందని ఈమె తెలియజేసారు. అయితే ముక్కు సర్జరీ కారణంగా శ్వాస ఆడక పోవడం, జలుబు తగ్గకపోవడం వంటివి జరిగాయి. అయితే డాక్టర్ వద్దకు వెళ్ళగా నాసికకుహరంలోని పాలిప్ అనే భాగాన్ని తొలగించాలని చెప్పారు. అయితే డాక్టర్లు ముక్కు పై భాగంలో కూడా కాస్త సర్జరీ చేయడంతో తన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించిందని తెలిపారు.

Priyanka Chopra: మూడు సినిమాల నుంచి తొలగించారు…
ఇక ఆ సమయంలోనే తాను మూడు సినిమాలకు కమిట్ అయ్యానని, నా మొహంలో ఈ మార్పులు కనిపించడంతో సినిమాలనుంచి కూడా తొలగించారని తెలిపారు.ఇలా సినిమా అవకాశాలు కోల్పోవడమే కాకుండా ఒక సినిమాలో చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించానని అదే సమయంలోనే నా సినీ కెరియర్ ముగిసిపోయిందంటూ తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ప్రియాంక చోప్రా తెలిపారు. అయితే ఆ సమయంలో తన తండ్రి అండగా నిలిచి తనకు కాస్మెటిక్ సర్జరీ చేయించినట్లు తెలిపారు.































