Pushpa : పుష్ప సినిమా విడుదలయి ఇండియా మొత్తాన్ని ఊపేసింది. బన్నీ మానేరిజం కామన్ ఆడియన్స్ నే కాదు సెలబ్రిటీలను సైతం ఆకర్శించాయి. తగ్గేదేలే అంటూ బన్నీ మానేరిజంను అందరూ అనుకరించారు. ఇక సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చేసే వాళ్ళందరూ దాదాపుగా ఇండియా మొత్తం పుష్ప సినిమాలోని పాటలు, డైలాగులతో సందడి చేసారు. అయితే సినిమా విడుదలైన కొన్ని రోజులు మాత్రమే ఇది చూస్తాం కానీ పుష్ప సినిమా విషయంలో మాత్రం ఈ క్రేజ్ ఇంకా తగ్గలేదు.

ఖండాలు దాటిన పుష్ప మానియా…..

ఇక ఇండియానే కాదు సోషల్ మీడియాల పుణ్యమాని విదేశాల్లో కూడా పుష్ప పాటలకు, డైలాగులకు ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది శ్రీవల్లి పాట స్టెప్పులను, ఊ అంటావా పాట స్టెప్పులను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పెడుతూ ఫేమస్ అవుతున్నారు. ఇక ఇపుడు అమెరికాకు చెందిన ఒక అమ్మాయి పుష్ప సినిమాలోని పాటలను వయోలిన్ తో వాయిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అయింది.
కాలిఫోర్నియా రోడ్లపై 13 ఏళ్ల చిన్నారి ఊ అంటావా.. ఉహు అంటావా పాటను వయోలిన్ ద్వారా వాయిస్తూ సందడి చేస్తోంది. గతంలో శ్రీవల్లి పాటను వయోలిన్ తో వాయించి యూట్యూబ్ లో ఫేమస్ అయింది. ఈ పాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా విడుదలయి చాలా రోజులైనా ఇంక సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ అభిమానుల సంగతి చెప్పాల్సిన పనిలేదు గాల్లో తేలిపోతున్నారు. ఇక సుకుమార్ పుష్ప పార్ట్ 2 పై అంచనాలు ఎక్కువ ఉండటంతో చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ వర్క్ చేసారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పుష్ప పార్ట్ 1 కన్నా రెండులో ట్విస్టులు మాములుగా ఉండవని అంటున్నారు. చూడాలి మరి పుష్ప పార్ట్ 2 ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో.



































