సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంధపుచెక్కల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో
తెరకెక్కుతున్నటువంటి చిత్రం “పుష్ప”. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక జోడీ కట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెంచాయి.

కరోనా రాకముందు ఈ సినిమాను ఆగస్టు 13వ తేదీ విడుదల చేయనున్నట్లు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు.అయితే కరోనా కారణం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడింది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారాన్ని చిత్రబృందం వెల్లడించారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కొద్ది రోజులలోనే షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విధంగా సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేశారు. “పుష్ప పార్ట్ 1 ఈ డిసెంబర్ లోనే.. తగ్గేదే లే”అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడంతో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో చేస్తూ అల్లుఅర్జున్ కు గట్టి పోటీగా నిలువనున్నాడు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
































