Raja Ravindhra : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసిన రాజా రవీంద్ర అసలు పేరు రమేష్ దంతులూరి. మొదట్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ ఉండే రాజా రవీంద్ర, కొన్ని తమిళ సినిమాల్లో విలన్ గా కూడా చేసారు. ఇక హీరోగా కూడా చేసిన రాజా రవీంద్ర ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ఇక రాజా రవీంద్ర సినిమాల్లో నటించడమే కాకుండా కొంత మంది హీరోలకు డేట్లు కూడా చూస్తుంటారు. అలా నిఖిల్, జయసుధ, రాజ్ తరుణ్, వెంకటేష్, నవీన్ చంద్ర, మంచు విష్ణు సినిమా డేట్స్ చూసుకుంటున్నారు రాజా రవీంద్ర. ఇక ఆయన శోభన్ బాబుగారి అబ్బాయి సినిమాల్లోకి రాకపోడానికి గల కారణలాను తెలిపారు.

అవన్నీ నా కొడుక్కి వద్దన్నారు శోభన్ బాబు…
సోగ్గాడిగా ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శోభన్ బాబు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. సినిమాల మీద మక్కువతో చదువుకుంటూనే స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాల కోసం కష్టపడ్డారు. మొదట్లో చిన్న చిన్న వేషాలు కూడా వేసిన శోభన్ బాబు ఆ తరువాత హీరోగా టాప్ రేంజ్ కి వచ్చారు. హైదరాబాద్ కి సినిమా పరిశ్రమ వెళ్లిపోయిన ఆయన మాత్రం చెన్నై లో ఉండిపోయారు ఇక ఆయన తనయుడిని హీరోని చేయాలని శోభన్ బాబు భావించలేదు.

ప్రతి సినిమా కు కష్టపడాలి పైగా విడుదల సమయంలో వత్తిడి ఉంటుంది అది శోభన్ బాబుగా నేను ప్రతి సినిమాకు పడుతూనే ఉన్నా నా కొడుకుకి ఆ కష్టం ఒత్తిడి ఉండకూడదని అనుకున్నారట. 5 కోట్ల సినిమా అయిన 500 కోట్ల సినిమా అయిన హీరో పడే టెన్షన్ మాత్రం ఒకటే ఎందుకంటే సినిమా ఏమైనా హీరో మీద ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో తాను హీరో అవ్వకపోడానికి కారణాలు చెబుతూ ఒక సందర్బంలో శోభన్ బాబు గారు ఆయన కొడుకుని ఎందుకు హీరోను చేయలేదో చెప్పిన మాటలను పంచుకున్నారు.