Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకోగా, RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్గా గుర్తింపు పొందిన జక్కన్న ఏకంగా తన తదుపరి సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి సినిమా చేసేలా ప్లాన్ చేశారు.
ఇలా రాజమౌళి తన తదుపరిచిత్రం మహేష్ బాబుతో చేయబోతున్నారు. ఈ సినిమా చేయడానికి ఈయన హాలీవుడ్ టెక్నీషియన్లతో పనిచేయబోతున్నారు ఈ క్రమంలోనే తరచూ ఈ సినిమా పనుల నిమిత్తం అమెరికా వెళ్లాల్సి రావడంతో అక్కడ హోటల్స్ లో ఉండలేక రాజమౌళి లాస్ ఏంజెల్స్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు సమాచారం.

Rajamouli: గ్రాండ్ పార్టీ ఇచ్చిన జక్కన్న…
ఇలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజమౌళి అమెరికాలో ఇంటిని అద్దెకు తీసుకోవడంతో ఈయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఇక నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడంతో ఈ ఇంటిలోనే రాజమౌళి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#Rajamouli rented a home in #LosAngeles for #RRR #Oscars Campaign????#RRRMovie #Oscars2023 #SSRajamouli #NTR #JrNTR #RamCharan #NaatuNaatu pic.twitter.com/Q2iYj4oVFc
— Crazy Buff (@CrazyBuffOffl) March 14, 2023



























