యూనిక్ స్టోరీస్ తో సోషల్ ఎవిల్స్ పై తన పెన్ను ఎక్కుపెట్టి సొసైటీలో సోషల్ అవేర్ నెస్ తీసుకొచ్చిన డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన సినిమాల్లో అవినీతి, లంచగొండితనం, అధికారుల అలసత్వం, ప్రభుత్వాల అంధత్వం పై తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగించాయి.

హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే సోషల్ ఎలిమెంట్స్ ను స్పృశించేవాడు. హాలీవుడ్ స్థాయిలో అత్యంత భారీ వ్యయంతో సినిమాలను నిర్మిస్తూ ప్రపంచమంతా ఇండియన్ మూవీస్ వైపు చూసే విధంగా చేశాడు. తన సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెరపై వండర్స్ క్రియేట్ చేశాడు.

‌‌జెంటిల్మేన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్ అపరిచితుడు, శివాజీ, రోబో మొదలగు చిత్రాలు వేటికవే ప్రత్యేకం ఒక సినిమాను మించి మరో సినిమా ఉంటుంది. ఈ సినిమాని అద్భుతం అనే లోపే మరో సినిమా దానిని బీట్ చేస్తుంది. శంకర్ సినిమా కి అనుగుణంగా ఏ.ఆర్.రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ రూపొందడంతో ఆ సినిమాలు ఏ స్థాయికి వెళ్ళాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

1993 ప్రాంతంలో శంకర్ కెరీర్ మొదట్లో జెంటిల్ మేన్ చిత్రం రూపొందే ముందు యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గారిని సంప్రదించడం జరిగింది. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అల్లరి ప్రియుడు సినిమాకి గాను రాజశేఖర్ తన డేట్స్ ఇవ్వడం వలన శంకర్ ఇచ్చిన జెంటిల్ మేన్ ఆఫర్ ని రాజశేఖర్ రిజెక్ట్ చేయడం జరిగింది.ఆ అవకాశం కాస్త అర్జున్ కు వెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here