ప్రియుడిని పరిచయం చేసిన రకుల్… త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందా?

0
375

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే నేడు స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇంస్టాగ్రామ్ ద్వారా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.

ఈ క్రమంలోనే ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ… థాంక్యూ మై లవ్ ఈ సంవత్సరం నువ్వే నాకు అతి పెద్ద బహుమతి నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన అందుకు, నన్ను ఎంతో సంతోష పెడుతున్నందుకు థాంక్స్.. మనిద్దరం ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను కలిసి పంచుకుందాం.. నువ్వు నా లవ్ గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది.

ఇలా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమిస్తున్నటువంటి బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని పెళ్లిచేసుకోబోతున్నానని చెప్పక పోయినప్పటికీ తనతో ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న రకుల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇక రకుల్ ప్రీతిసింగ్ సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన కొండపొలం సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.ఈ చిత్రంతో పాటు బాలీవుడ్లో మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here